Friday, May 3, 2024

గురుకుల కాలేజీ నిర్మాణానికి హెచ్‌ఎఎల్ చేయూత

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఎఎల్ అధికారులను సన్మానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

HAL construction Gurukul College

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్దసంఖ్యలో నెలకొల్పారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగద్గిరిగుట్టలోని ఎస్‌సి మహిళా గురుకుల పాఠశాల, డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌ఎఎల్ రూ.17 కోట్లు మంజూరు చేసింది. శనివారం హెచ్‌ఎఎల్ అధికారులు నగరంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి, ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్ రాస్‌లు సంతోషం వ్యక్తం చేస్తూ హెచ్‌ఎఎల్ అధికారులను అభినందించిన అనంతరం శాలువాతో సత్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పాఠశాల, కాలేజీకి శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు సిఎస్‌ఆర్ నిధులను హెచ్‌ఎఎల్ ముందుకు వచ్చి రూ. 17 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలలో సుమారు 6 లక్షల మందికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. అమ్మాయిలు తమ చదువులను మధ్యలోనే ఆపేయకుండా కొనసాగించేందుకు వారి కోసం ప్రత్యేకంగా 30 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్,హెచ్‌ఎఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటే, అధికారులు రాంకిశోర్, సురేందర్ జతీందర్‌పాల్ కౌర్, ప్రహ్లాద్, గురుకుల విద్యా సంస్థల సొసైటీ అధికారులు హన్మంత్‌నాయక్, మామిడాల ప్రవీణ్ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News