Saturday, April 27, 2024

ముందు మీ రాష్ట్రాలలో దుస్థితి చూసుకోండి

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal

న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నిన్నటి నుంచి కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా, విద్యుత్‌పై ఇస్తున్న సబ్సిడీల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందని మనోజ్ తివారీ గత సోమవారం చేసిన ప్రకటనతో వీరి మధ్య మాటల పోరు మొదలైంది. అటువంటి వాగ్దానాలు చేసి బిజెపి ఢిల్లీ ప్రజలను ఎద్దేవా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించిన దరిమిలా రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి పెద్ద ఎత్తున ప్రజలకు హామీల వర్షం కురిపిస్తోంది. ఐదు రెట్టు ఎక్కువగా సబ్సిడీలు ఇస్తామన్న మనోజ్ తివారీ ప్రకటనకు కేజ్రీవాల్ బుధవారం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐదు రెట్టు ఎక్కువ సబ్సిడీ&అంటే అర్థం ఏమిటి? 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు బదులుగా 1000 యూనిట్లు ఇస్తారా? ఇప్పుడు ఉచితంగా అందచేస్తున్న 20,000 లీటర్ల మంచినీటికి బదులుగా 1 లక్ష లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తారా? ఇటువంటి వాగ్దానాలతో ప్రజలను ఎద్దేవా చేస్తున్నారు. ఈ హామీలను ముందుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లోపే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అమలు చేసి చూపించండి అంటూ కేజ్రీవాల్ సవాలు చేశారు.
దీనికి మనోజ్ తివారీ వెంటనే సమాధానమిస్తూ గడచిన ఐదేళ్లలో మీరు ఎన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేగాక ఈ ఎన్నికలలో మీరు ఇచ్చే హామీలకు ఐదు రెట్లు ఎక్కువగా మేము అమలు చేస్తామని ఆయన చెప్పారు. తివారీ ప్రశ్నలకు కేజ్రీవాల్ గురువారం సమాధానమిచ్చారు. మీరు అధికారంలో ఉన్న హర్యానాలో ఒక్కో కుటుంబానికి మంచినీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య వంటి సౌకర్యాల కల్పనలో ఏ మేరకు ప్రయోజనం చేకూర్చారో చెప్పాలంటూ బిజెపిని ఎదురు ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ ఎంపి సంజయ్ సింగ్ హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పోస్ట్ చేసిన ట్వీట్‌ను షేర్ చేశారు. కరెంటు లేక చీకట్లోనే పనిచేసుకుంటున్న చౌతాలా ఫోటోను ఆయన షేర్ చేస్తూ అదీ హర్యానాలో దుస్థితి అంటూ వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal counters to Manoj Tiwari’s promises

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News