Monday, May 6, 2024

లంచం అడిగిన తహసీల్దార్‌కు షాకిచ్చిన మహిళ..

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: లంచం అడిగిన అధికారికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. తన గేదెను లంచంగా తీసుకొని తనకు సంబంధించిన పనిని పూర్తిచేయమని ఓ మహిళ తహాసీల్దారు కార్యాలయానికి వెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో సిద్ధి జిల్లాలోని సిహవాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నౌదియా గ్రామానికి చెందిన రామ్ కళి పటేల్ అనే మహిళ.. తమ కుటుంబానికి చెందిన పూర్వికుల ఆస్తిని తన పేరు మీదకు బదిలీ చేయాలని తహాసీల్దారు కార్యాలయానికి వెళ్లింది. అయితే, రూ.10 వేలు లంచం ఇస్తే పని పూర్తిచేస్తానని తహాసీల్దారు మైఖెల్ తిర్కి డిమాండ్ చేయడంతో.. ఆమె పదివేలు లంచం ఇచ్చింది. అయినా పని పూర్తిచేయని సదరు అధికారి.. మరికొంత డబ్బు ఇస్తేగానీ పని జరగదని చెప్పాడు.

దీంతో తన గేదెను తహాసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లిన మహిళ.. తన దగ్గర డబ్బు లేదని, దానికి బదులు తన గేదెను లంచంగా తీసుకొని పని పూర్తిచేయాలని అధికారిని కోరింది. లంచం అడిగిన విషయం అక్కడున్నవారందరికీ తెలియడంతో సదరు అధికారి దబాయిస్తూ, లంచం ఎవరు అడిగారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవంబర్ 14వ తేదీనే ఆమె పేరుమీద పూర్వికుల ఆస్తిని బదిలీ చేశామని, అంతేకాదు.. దానిని ఆర్ సిఎమ్ఎస్ పోర్టల్ లో కూడా అప్డేట్ చేశామని తెలిపాడు. తనను అల్లరి చేసేందుకు ఆమె కుట్రపన్ని గేదెను కార్యాలయానికి తీసుకువచ్చిందని సదరు అధికారి ఆరోపించాడు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు అధికారులు తెలిపారు. మెదడు వ్యాధితో బాధపడుతున్న ఆ మహిళ గత మూడు నెలలుగా నాగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల తిరిగొచ్చిందని చెప్పారు.

woman offers buffalo as bribe in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News