Sunday, April 28, 2024

పటాకులు కాల్చొద్దు.. కలిసి పూజ చేద్దాం: కేజ్రివాల్

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal urges for cracker free Diwali

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. దీపావళి రోజైన నవంబర్ 14న ఎటువంటి పటాకులు కాల్చొద్దని కోరారు. అలా చేస్తే ప్రజల అనారోగ్యానికి కారకులవుతారని సూచించారు. పండుగ రోజు రాత్రి 7:49 నుంచి లక్ష్మీపూజ మొదలు పెడుతున్నట్టు చెప్పారు. టీవీల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రంలో ప్రజలందరూ పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా పలు రాష్ట్రప్రభుత్వాలు క్రాకర్స్ కాల్చడంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News