Tuesday, April 30, 2024

ఆర్యన్ వాట్సాప్ చాట్‌లో ఎలాంటి కుట్ర కోణం లేదు

- Advertisement -
- Advertisement -
Aryan WhatsApp Chats Not Suspicious Says Bombay HC
బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన బాంబే హైకోర్టు

ముంబయి: ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లో ఎలాంటి కుట్ర లేదని ముంబయి హైకోర్టు స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌లో కుట్రకోణం దాగి ఉన్నట్లు ఎలాంటి సాక్షాధారాలు లేవని ముంబయి హైకోర్టు తన బెయిల్ ఉత్తర్వుల్లో స్పష చేసింది. ముంబయి హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్ డబ్లు సాంబ్రే గత నెల 28న ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చెంట్, ఫ్యాషన్ మోడల్ మున్నన్ ధమూచాలకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

బెయిల్ ఉత్తర్వుల పూర్తి వివరాలు శనివారం మీడియాకు వెల్లడయ్యాయి. అంతేకాదు, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు రికార్డు చేసిన ఆర్యన్ ఖాన్ స్టేట్‌మెంట్‌ను కేవలం దర్యాప్తు అవసరాల కోసం మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చు తప్ప నిందితులు నేరానికి పాల్పడ్డారనే నిర్ణయానికి రావడానికి ఒక సాధనంగా ఉపయోగించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్‌స కేసులో ఆర్యన్ ఖాన్ గత నెల 3 అరెస్టయిన విషయం తెలిసిందే. మూడు వారాల పాటు జైల్లో ఎన్‌సిబి విచరణను ఎదుర్కొన్న అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. ఆయనతో పాటుగా అర్బాజ్‌మర్చెంట్, మున్‌మున్ ధమేజాలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News