Thursday, May 9, 2024

అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించారు. రవిచంద్రన్ అశ్విన్ అంటేనే స్పిన్ మాయజాలంతో బ్యాట్స్ మెన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించి ఆధిపత్యం చెలాయించిన రోజులు చాలా ఉన్నాయి. ఒక బ్యాట్స్  మెన్ ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 12 సార్లు ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. బెన్ స్టోక్స్ ను ఇప్పటి వరకు రవిచంద్రన్ 12 సార్లు ఔట్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఇషాంత్ శర్మ, కపిల్ దేవ్ లు 11 సార్లు ఔట్ చేసిన రికార్డు వారి ఖాతాలో ఉండేది. అశ్విన్ ఇప్పటి వరకు 96 టెస్టులు ఆడి 495 వికెట్లు తీశాడు. ఇంకా ఐదు వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్బులో చేరిపోతాడు.

 

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ 96 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 401 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 211 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఒక బ్యాట్స్ మెన్ అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్లు వీళ్లే:

రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ బెన్ స్టోక్స్: 12 సార్లు

రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ డేవిడ్ వార్నర్: 11 సార్లు

ఇషాంత్ శర్మ వర్సెస్ అలిస్టెర్ కుక్: 11 సార్లు

కపిల్ దేవ్ వర్సెస్ గ్రాహం బూచ్ : 11 సార్లు

హర్భజన్ సింగ్ వర్సెస్ రికీ పాంటింగ్: 10 సార్లు

కపిల్ దేవ్ వర్సెస్ అలెన్ బోర్డర్: 10 సార్లు

కపిల్ దేవ్ వర్సెస్ డీ గోవర్: 10 సార్లు

కపిల్ దేవ్ వర్సెస్ ఎం మార్షల్: 10 సార్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News