Friday, May 17, 2024

జ‌పాన్ ప్ర‌ధానిపై దాడి..

- Advertisement -
- Advertisement -

టోక్యో: జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదా పెను ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. వ‌క‌యామా సిటీలో ప్ర‌ధాని కిషిదా ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆయ‌న ప్ర‌సంగం మొదలవ్వడానికి కొన్ని సెక‌న్ల ముందే భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. మీటింగ్ నిర్వ‌హిస్తున్న నేత‌ల‌పై స్మోక్ లేదా పైప్ బాంబును విసిరి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

Read also:గృహప్రవేశంలో విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి..

ప్ర‌ధాని మీటింగ్‌కు హాజ‌రైన జ‌నం బాంబు పేలుడుతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అక్క‌డ ఉన్న వారంతా ఉరుకులు ప‌రుగులు పెట్టారు. బాంబు దాడిలో కిష‌దాకు ఎటువంటి ప్రమాదమేమి జరగలేదు. దీంతో ఆయ‌నను అధికారులు అక్క‌డ నుంచి హుటాహుటిన త‌ర‌లించారు. లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ వ్య‌క్తితో కిషిదా మాట్లాడుతున్న స‌మ‌యంలో బాంబు పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. స్మోక్ బాంబుతో అటాక్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకున్న‌ట్లు స్థానిక మీడియా చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News