Sunday, April 28, 2024

ఆస్ట్రేలియాకు ఓదార్పు

- Advertisement -
- Advertisement -

Australia wins 3rd T20 match against India

 

కోహ్లి పోరాటం వృథా
చివరి టి20లో భారత్ ఓటమి
ఓడినా సిరీస్ టీమిండియాదే

సిడ్నీ: భారత్‌తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలి యా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. స్పిన్నర్ మిఛెల్ స్వెప్సన్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. స్వెప్సన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించగా, హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. తొలి టెస్టు మ్యాచ్ ఈ నెల 17 నుంచి ఆడిలైడ్ వేదికగా జరుగుతుంది.

కోహ్లి ఒంటరి పోరాటం

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చి న కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అండతో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇటు ధావన్, అటు కోహ్లి కుదురుగా ఆడారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ కుదుట పడింది. ఈ జోడీని విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు తీవ్రంగా శ్రమించక తప్పలేదు. ధావన్ తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. అతని సహకారంతో కోహ్లి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుదురు కోవడంతో భార త్ లక్షం దిశగా అడుగులు వేసింది. అయితే కీలక సమయంలో శిఖర్ ధావన్ ఔటయ్యాడు. 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన ధావన్‌ను స్వెప్సన్ వెనక్కి పంపాడు. దీంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడిం ది. తర్వాత వచ్చిన సంజు శాంసన్ మరోసారి నిరాశే మిగిల్చాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన శాంస న్ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ఈ వికెట్ కూడా స్వెప్సన్ ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(0) కూడా ఔటయ్యాడు. ఇతన్ని కూడా స్వెప్సన్ ఇంటిదారి పట్టించాడు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. 20 పరుగులు మాత్రమే చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 61 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 4 ఫోర్లతో 85 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ రెండు ఫోర్లతో అజేయంగా 17 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

Australia wins 3rd T20 match against India

 

ఆదుకున్న వేడ్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (0)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. అయితే మరో ఓపెనర్ మాథ్యూవేడ్ మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. స్టీవ్ స్మిత్ (24) అండతో స్కోరును ముందుకు నడిపించాడు. వేడ్ ధాటిగా ఆడగా స్మిత్ సమన్వయంతో ఆడుతూ అతనికి సహకారం అందించారు. కుదురుగా ఆడుతున్న స్మిత్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇటు వేడ్, అటు మాక్స్‌వెల్ చెలరేగి ఆడడంతో స్కోరు వేగం పుంజుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వేడ్ 53 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మాక్స్‌వెల్ 36 బంతుల్లోనే మూడు ఫోర్లు, మరో 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి నటరాజన్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News