Monday, April 29, 2024

ఖమ్మం ఐటిహబ్ జోరు

- Advertisement -
- Advertisement -

ప్రారంభమైన రెండో రోజునే 19 కంపెనీల భాగస్వామ్యం
140 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ
ఉమ్మడి జిల్లా యువతకు ఉపాధి కేంద్రం, హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల్లో
ఉద్యోగాలకు టాస్క్ ద్వారా శిక్షణ : మంత్రి పువ్వాడ అజయ్

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి జిల్లా యువతకు ఐటీ హబ్ ఉపాధికల్పనా కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. నగరంలో సోమవారం ప్రారంభమైన ఐటీ హబ్‌లో వివిధ కంపెనీల ద్వారా ఎంపికైన వారికి మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలసి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఐటీ రంగాల్లోనే కాకుండా ఇతర రంగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి క ల్పించేందుకు టాస్క్‌ద్వారా వృత్తి నైపుణ్యం కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్ధులతో పాటు, పదో తరగతి, ఇంటర్ అర్హతలపై హై దరాబాద్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశా లు కల్పించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్న ట్లు మంత్రి తెలిపారు. ఐటీ హబ్‌లో 19 ప్రముఖ కంపెనీలు భాగస్వాములయ్యాయన్నారు. కంపెనీల ద్వారా ఎంపికైన 140మంది కి నియామక పత్రాలు మంగళవారం అందజేశామన్నారు. రాబోయే రోజుల్లో ఐటి హబ్ రెండో దశ ఏర్పాటు చేయటం ద్వారా మరిన్ని కంపెనీలు నగరానికి రానున్నాయన్నారు. మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖా మంత్రి సంపూర్ణ సహకారంతో నగరంలో అత్యాధినిక వసతులతో ఐటీ హబ్ ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా జాబ్‌మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఐటి హబ్‌ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్ మాట్లాడుతూ ప్రముఖ విదేశి కంపెనీలు మన నగరంలోనే అందబాటులకి వచ్చాయన్నారు. స్ధానిక యువత తమకు ల భించిన ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తులో ఉన్నత స్ధాయికి చేరాలన్నారు.

ఉమ్మడి జిల్లా యువతకు స్దానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్షంతో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రివర్యుని సహకారంతో, రాష్ట్ర రవాణాశాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌కుమారి ప్రత్యేక చొరవతో ఐటి హబ్ ను స్వల్ప కాలంలోనే ఏర్పాటు చేసుకోవటం, ప్రసిధ్ధిచెందిన వివిధ ఐటి కంపెనీలు మన ఐటి హబ్‌లో భాగస్వాములై స్ధానిక యువకతకు ఉపాధి కల్పించేందుకు ముందకొచ్చాయన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులు మంత్రి పువ్వాడను, కలెక్టర్ కర్ణన్‌ను ఘనంగా సత్కరించారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో టెక్నాలజీ సీఈవో ల్యాక్స్ చేకూరి, ఆటోమేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీకాంత్‌కేసా, సెర్లో ఇన్ఫొ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఉపేందర్ గాదే, ప్రొవేస్ సాఫ్ట్‌వేర్ సర్విసెస్ సీఈవో అరవింద్‌కొండా, ఇండియా బిజ్ సీఈవో యశ్వంత్ దేవిశెట్టి, టెక్‌స్కై ప్రమోటర్ ప్రకాష్, రాకేష్ బత్తినేని, నింబుల్ అకౌంటింగ్ అపరేషన్స్ డైరెక్టర్ ప్రసాద్ బండారు, శిక్షణ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

19 Companies started Operations in IT Hub in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News