Saturday, April 27, 2024

జనవరి రెండో వారంలో వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

టీకాపై ఈ నెలాఖరులో ప్రధాని ప్రకటించే అవకాశం
టీకా డోసు ధర రూ. 250?

మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి సెకండ్ వీక్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈమేరకు పంపిణీ, స్టోరేజ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కరోనా వ్యాక్సిన్ ఏర్పాట్లపై కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. డిసెంబరు చివరి వరకు పిఎం మోడీ వ్యాక్సిన్‌ను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని, అయితే అన్ని రాష్ట్రాలకు జనవరి సెకండ్ వీక్ వరకు పంపిణీ చేస్తామని కేంద్రం పేర్కొంది. ఈక్రమంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ వివిధ రాష్ట్రాల ను సూచించింది. మరోవైపు వ్యా క్సిన్ పంపిణీ ఎలా చేయాలి? ఫ్ర ంట్ లైన్ వర్కర్ల వివరాలను సాప్ట్‌వేర్‌లో ఎలా నమోదు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొలి విడత ఎవరెవరికీ ఇవ్వాలి? కోల్డ్‌చైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? అనే వివరాలపై కూడా కేంద్రం అవగాహన కల్పించింది. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరకు ప్రజలంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో విడతల వారీగా క్లినికల్స్ ముగించుకున్న టీకాలు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయని ఎంతో మంది ఆశతో వేచి చూస్తున్నారు. దాదాపు 90 నుంచి 95 శాతంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటిస్తున్న సంస్థల వ్యాక్సిన్లు కొరకు ప్రజలతో పాటు శాస్త్రవేత్తలు, వైద్యరంగ నిపుణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్, ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్, ఆక్స్‌పర్డ్ యూనివర్సీటి ఆస్ట్రాజెనెక్ వ్యాక్సిన్, రష్యాకు చెందిన స్ఫుత్నిక్, భారత్ బయోటెక్‌కి చెందిన కోవాగ్జిన్, యూకేకు చెందిన నోవావాక్స్ , అమెరికాకు చెందిన మరో వ్యాక్సిన్ ఇనోవియో ఫార్మాస్యూటికల్ టీకాలపై ప్రజలంతా ఎక్కువ ఇంట్రస్ట్‌తో ఉన్నట్లు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ సుమారు 90 నుంచి 95 శాతం సురక్షితంగా పనిచేస్తున్నాయని ఇటీవల ఆయా తయారీ సంస్థలతో పాటు శాస్త్రవేత్తలు కూడా ప్రకటించడంతో ప్రజల ఆశలు రెట్టింపయ్యాయి.
భారత్‌లో టీకా డోసు ధర కేవలం రూ. 250
సీరం సంస్థ నిర్ణయించే అవకాశం
కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ టీకా డోసు ధరను రూ.250 గా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు టీకా సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ మీడియా సంస్థ మంగళవారం నివేదించింది. వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ సీరం, ఫైజర్, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నాయి. దీనిపై రెండు వారాల్లో నిర్ణయాలు జరగవచ్చు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల ధరలపై వార్తలు వస్తున్నాయి. సీరం సంస్థ భారీగా టీకాలు సరఫరా చేస్తుందన్న నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భారత్ లోని ప్రైవేట్ మార్కెట్‌లో ఒక్కో డోసు ధర రూ. 1000 వరకు ఉండవచ్చని భారీ సరఫరా ఒప్పందాలపై సంతకాలు చేసిన ప్రభుత్వాలకు అంతకన్నా తక్కువ ధరకే డోసులు లభించవచ్చని సీరం సీఐఒ అదర్‌పూనావాలా ఇటీవల వెల్లడించారు.

Vaccine may be available in India by January

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News