Friday, May 17, 2024

అభివృద్ధికి అధికారులే మూల స్తంభాలు

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వెంటనే విడుదల చేయాలి
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

నర్సంపేట: రాష్ట్రాభివృద్ధికి మూల స్తంభాలు అధికారులేనని వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారుల సహాయ సహకారాలతోనే ప్రజల అవసరాలు తీరుస్తారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సక్రమంగా జీతాలు రావడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు 1 నుంచి 5 లోపు జీతాలు వచ్చేవని అటువంటిది అధికారులు, ప్రజలు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో 15 తేదీ వరకు జీతాలు వస్తున్నాయని దీంతో ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు రుణాలు తీసుకున్న వారు డిఫాల్టర్లు అవుతున్నారన్నారు. రోజుకో జిల్లా చొప్పున ప్రభుత్వాధికారులకు జీతాలు ఇస్తుందని, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు 1 నుంచి 5 వరకు జీతాలు వేస్తున్నారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా జీతాలు చెల్లిస్తే వారెంతో ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకుంటుందని స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన డబ్బులను వాడుకుంటుందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ చెల్లించకుండా కాలయాపన చేస్తూ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సమైక్యాంధ్ర పాలకుల నుంచి ఎన్నో ఒత్తిడిలు, ఇబ్బందులు ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్నారు. ఉద్యోగులు, మేధావులు, ప్రజలంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.

కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపల్లి నర్సింహరాములు, మహబూబాద్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ జాటోతు సంతోష్‌నాయక్, నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, మాజీ సర్పంచులు చిలువేరు రజనీభారతి, పులి ప్రసాద్, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ జూలూరి మనీష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచాల సతీష్, పట్టణ యూత్ అధ్యక్షుడు గూడూరు సందీప్, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News