Sunday, May 12, 2024

అవిక అందాలకు యూత్ ఫిదా

- Advertisement -
- Advertisement -

Avikagor act with Kalyan dev

టాలీవుడ్‌లోకి ఒక వేవ్‌లా వచ్చిన నవతరం బ్యూటీ అవికాగోర్. బాలనటిగానే అవార్డులు రివార్డులు అందుకున్న అవికా గోర్ ఆ తర్వాత కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆరంగేట్రమే ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుని కెరీర్ జర్నీని సాఫీగానే రన్ చేసింది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకొని తిరిగి టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్న అవికాగోర్ రైటర్ కమ్ దర్శకుడు శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో నటిస్తోంది.

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ చిత్రంలో కథానాయకుడు. జిఎ2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ సం యుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బుధవారం అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో అవిక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్‌కి యూత్ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News