Saturday, April 27, 2024

రామ మందిర నిర్మాణం కోసం కీలక ప్రకటన చేసిన మోడీ

- Advertisement -
- Advertisement -

Ram Mandir

 

 

ఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలలో మోడీ మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా రామ మందిర నిర్మాణం కోసం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ కేత్రం అనే ట్రస్టు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ట్రస్టు స్వయం ప్రతిపత్తిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అయోధ్యకు మొత్తం 67.73 ఎకరాల భూమిని కేటాయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డుకు యుపి ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయించిందని మోడీ తెలియజేశారు. రామజన్మభూమి ట్రస్టు కింద మొత్తం 15 ట్రస్టులు పని చేస్తాయని, అందులో ఒక ట్రస్టు దళిత కులానికి చెందినదని హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రపంచమనేది కుటుంబమని, అందరూ సంతోషంగా ఉండాలన్నారు. భారత దేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, జైన్, బౌద్ధులు భాగమని, అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ పేరు తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని మోడీ తెలిపారు. రామ మందిరం నిర్మాణం గురించి మోడీ చెప్పగానే కొందరు ఎంపిలు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు.

 

 

 

Ayodhya Ram Mandir Construction for Trust says Modi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News