Saturday, May 4, 2024

సారా హార్ట్ ఆఫ్ సైంధవ్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రంలో ‘సైంధవ్’గా తన ఫెరోషియస్ షేడ్స్ ఇప్పటివరకు చూశాము. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని తెలియజేశారు మేకర్స్. పోస్టర్‌లో పాప వెంకటేష్‌ను కౌగిలించుకోవడం చూడవచ్చు. ఇందులోవెంకటేష్ గాయాలతో కనిపిస్తున్నారు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైంధవ్ సినిమా హై-ఆక్టేన్ యాక్షన్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రంతో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్… వికాస్ మాలిక్ క్యారెక్టర్‌లో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రి యా జెర్మియా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ సైంధవ్ డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News