Thursday, May 16, 2024

బ్యాడ్ లక్ సఖి

- Advertisement -
- Advertisement -

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి… అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసా ద్ మంచి బాణీని సమకూర్చగా.. శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. హరిప్రియ, సమీర భరద్వా జ్, ఎంఎల్‌ఆర్ కార్తికేయన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె శకునం ఎలాంటిదో ఎంతో సరదాగా చూపించా రు. ఈ స్పోర్ట్ రామ్ కామ్ సినిమాలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా ఎంతో చక్కగా నటించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.

Bad Luck Sakhi song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News