Monday, April 29, 2024

బద్వేల్ ఉప ఎన్నిక బాధ్యత మంత్రి పెద్దిరెడ్డిదే

- Advertisement -
- Advertisement -

Badvel by election in Andhra Pradesh

అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికపై వైసిపి కసరత్తు చేస్తోంది. ఒక్కో మండలం బాధ్యత ఎంఎల్‌ఎలకు సిఎం జగన్ అప్పగించారు. బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డికి సహాయకారిగా మరికొందరు నేతలు వ్యవహరించనున్నారు. పోరుమామిళ్ల-వర ప్రసాద్ రెడ్డి, కాశినాయన-తోపుదుర్తి, బద్వేలు-శ్రీకాంత్, బి.కోడూరు-రఘురాంరెడ్డి, అట్టూరు-సుధీర్, గోపవరం-చెవిరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. బద్వేలు ఉప ఎన్నికలలో పోటీపై బిజెపి-జనసేన మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏ పార్టీపై పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జనలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటికల్లా పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News