Friday, May 3, 2024

బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Bahrain prime minister sheikh khalifa passed away

మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ ఖలీఫా అమెరికాలోని మయో క్లీనిక్ లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. వవారం రోజుల పాటు ఆదేశంలో ఆయన సంతాప దినాలు ప్రకటించారు. 1970 నుంచి ప్రధానిగా షేక్ ఖలీఫా బహ్రెయిన్ కు ప్రధానిగా సేవలందిస్తున్నారు. 1971, ఆగ‌స్టు 15వ తేదీన ఆ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింది. ప్ర‌పంచంలో సుదీర్ఘ‌కాలం ప్ర‌ధాన మంత్రిగా చేసిన రికార్డును బిన్ స‌ల్మాన్ ఖ‌లీఫా సొంతం చేసుకున్నారు.

Bahrain prime minister sheikh khalifa passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News