Monday, April 29, 2024

బండి వర్సెస్ పొన్నం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ ఎంపి స్థానాన్ని కైవసం చేసుకుంటాం : పొన్నం
నేను ఎంపిగా గెలిస్తే ‘పొన్నం’ రాజీనామా చేయడానికి రెడీనా?
రాముడి పేరుతోనే ఎన్నికలకు వెళ్తా .. నేను ఓడితే రాజకీయ సన్యాసం: బండి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. వారిద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసరుకుంటున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపి స్థానాన్ని కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని, తానే దగ్గరుండి గెలిపిస్తానని బండి సంజయ్‌ను ఓడగొడతానని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనిపై బండి సంజయ్ పొన్నంకు ప్రతి సవాల్ విసిరారు. ఈసారి కూడా కరీంనగర్ ఎంపీగా తానే గెలుస్తానని, తాను గెలిస్తే మంత్రి పొన్నం రాజీనామా చేయడానికి రెడీనా? అని బండి సంజయ్ ప్రతి సవాలు విసిరారు.

‘ప్రజాహిత యాత్రపై దాడికి ఉసిగొల్పిన కాంగ్రెస్ నాయకుడికి సవాల్ విసురుతున్నా. పిరికివాడిలా పారిపోయే వాడిని కాదు ధైర్యంగా ధర్మం గురించి మాట్లాడేవాడిని. ఈ లోక్ సభ ఎన్నికల్లో నువ్వు కానీ, నువు నిలబెట్టిన అభ్యర్ధి కానీ నా మీద గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓడిపోతే నువ్వు తీసుకుంటావా? ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా మీకు?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. తన మత విశ్వాసాలతో రాముడి పేరుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతానని బండి సంజయ్ అన్నారు. పొన్నం ప్రభాకర్ పెట్టుకొనే అభ్యర్థి కనుక గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను మళ్లీ రాముడు, హిందూ ధర్మం గురించి మాట్లాడానని ఒకవేళ నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని ప్రశ్నించారు.

తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ల అమ్మను అవమానించుకుంటున్నారని అన్నారు. తాను వాళ్ల అమ్మకి పాదాభి వందనం చేస్తానని అన్నారు. రాముడు, తల్లి అంశాలపై కాంగ్రెస్‌ది అనవసర రాద్దాంతమని అన్నారు. బిఆర్‌ఎస్ ఇదే విధానం అవలంభించి ప్రజా వ్యతిరే కతను మూటగట్టుకుంది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం పథకాలను వివరిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నందున తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 17కు 17 స్థానాలు గెలవడం ఖాయమని అన్నా రు. కరీంనగర్ అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పారు. తమ ప్రభుత్వం 27 మంది బిసిలను మంత్రులను చేసిందని గుర్తు చేశారు.

Ponnam Prabhakar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News