Sunday, May 5, 2024

బంగ్లాదేశ్ పెను సంచలనం..

- Advertisement -
- Advertisement -

మౌంట్‌మాంగనూయ్:బంగ్లాదేశ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. సొంత గడ్డపై ఎంతో ఘన రికార్డును కలిగిన కివీస్‌పై బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. 42 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ ప్రతిభను కనబరిచిన బంగ్లాదేశ్ బలమైన కివీస్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 458 పరుగులు సాధించింది.

మరోవైపు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకే పరిమితమైంది. దీంతో బంగ్లాదేశ్‌కు కీలకమైన 130 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఇబాదత్ హుసేన్ అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఇబాదత్ 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరి ధాటికి ఎదురు నిలువలేక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకే కుప్పకూలింది. ఇక 42 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇబాదత్ హుసేన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

Bangladesh defeat NZ by 8 wickets in 1st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News