Tuesday, April 30, 2024

బార్బోరా-రాజీవ్ జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

Barbora rajeev storm to mixed doubles title at Australian Open

 

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను ఆరో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)బార్బోరా క్రెజిసికోవా (చెక్) జంట గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రాజీవ్ జోడీ 61, 64తో ఆస్ట్రేలియాకు చెందిన సమంతా స్టోసర్‌మాథ్యూ ఎబ్డెన్ జంటను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే రాజీవ్ జోడీ చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జంటపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో సునాయాసంగా తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం ఆస్ట్రేలియా జంట కాస్త పుంజుకుంది. నిలకడైన ఆటతో బార్బోరా జోడీకి గట్టి పోటీ ఇచ్చింది. అయితే కీలక సమయంలో సమంతా జంట ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన రాజీవ్‌బార్బోరా జోడీ వరుసగా రెండో సెట్‌ను కూడా గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News