Saturday, April 27, 2024

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Bathukamma wishes by CM KCR

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య పాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన బతుకమ్మను ఇవాళ ఖండాంతరాలకు విస్తరించడం గొప్ప విషయమన్నారు. పల్లెపల్లెనా బతుకమ్మను జరుపుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయన్నారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కెసిఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, అమ్మవారిని కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News