Friday, April 26, 2024

హ్యాపీ బర్త్ డే కుంబ్లే..

- Advertisement -
- Advertisement -

BCCI congratulated Anil Kumble on his 51st birthday

చిరస్మరణీయ కానుకను షేర్ చేసిన బిసిసిఐ

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 51వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిసిసిఐ ఆదివారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో అతను పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘403 అంతర్జాతీయ మ్యాచ్‌లు..956 వికెట్లు..టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన ఏరైక బౌలర్ .. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బిసిసిఐ ట్వీట్‌లో పేర్కొంది. కుంబ్లేకు విషెస్ చెప్పిన వారిలో బిసిసిఐతో పాటుగా పలువురు ప్రముఖ క్రికెటర్లు కూడా ఉన్నారు.

కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కుంబ్లే.. 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619 వికెట్లతో పాటు ఓ సెంచరీ, అయిదు అర్ధ సెంచరీలు చేసిన జంబో( కుంబ్లే ముద్దుపేరు) వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే టెస్టుల్లో నేటికీ టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మొత్తంమీద టెస్టు క్రికెట్‌లో ముత్తయ్య మురళీధరన్, షేన్‌వార్న్, జేమ్స్ అండర్సన్ తర్వాత నాలుగో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2008 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుంబ్లే..2016 17సంవత్సరాల్లో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆయన ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News