Tuesday, May 21, 2024

కొవిడ్‌పై పోరుకు బిసిసిఐ చేయూత

- Advertisement -
- Advertisement -

BCCI help to corona patients

ముంబై: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న భారత్‌ను ఆదుకునేందుకు క్రికెటర్లు తమవంతు సహాయం చేసేందుకు ముందుక వస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా పలువురు క్రికెటర్లు తమకు తోచిన సాయం చేస్తూ కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. కోహ్లి, సెహ్వాగ్, రైనా, పంత్, పాండ్య సోదరులు ఇప్పటికే కరోనా కట్టడిలో తమవంతు సహకారం అందించిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కూడా భారీ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌కు విపరీత కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు వైద్యశాలలకు దాదాపు రెండు వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా దయనీయ పరిస్థితి నెలకొనడం తనను ఎంతో కలచి వేస్తుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక కొవిడ్‌పై పోరులో తమవంతు సాయంగా రెండు వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందచేస్తామని ప్రకటించాడు. రానున్న రోజుల్లో దశల వారీగా వీటిని వివిధ ఆసుపత్రులకు చేరవేస్తామని, దీని కోసం స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించాడు. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని కూడా గంగూలీ అభినందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News