Monday, April 29, 2024

హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే!

- Advertisement -
- Advertisement -

BCCI not chance to Uppal Stadium for Domestic Series

మన తెలంగాణ/హైదరాబాద్: స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా పలు సిరీస్‌లు జరుగనున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో భారత్ సిరీస్‌లను ఆడనుంది. దీని కోసం పలు నగరాలను వేదికగా ఎంపిక చేశారు. కానీ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియం ఉన్నప్పటికీ హైదరాబాద్‌పై బిసిసిఐ చిన్నచూపు చూసింది. దీనికి హైదరాబాద్ క్రికెట్ సంఘంలో నెలకొన్న విభేదాలే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్నో, కటక్, త్రివేండ్రం వంటి నగరాలకు ఈసారి మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా మ్యాచ్ జరుగనుంది. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మాత్రం ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. చివరికి ధర్మశాల కూడా రెండేసి మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొహాలీ, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ తదితర నగరాల్లో పలు మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైదరాబాద్‌కు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో నగరానికి చెందిన క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.

BCCI not chance to Uppal Stadium for Domestic Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News