Wednesday, May 15, 2024

పాన్ ఇండియా మూవీగా ‘బీస్ట్’… రిలీజ్ డేట్ లాక్

- Advertisement -
- Advertisement -

Beast Movie to release on April 13th

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ నటించిన క్రేజీ ప్రాజెక్టు ‘బీస్ట్’. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి సాంగ్ అరబిక్ కుతు లిరికల్ వీడియో రికార్డు వ్యూస్ దక్కించుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు. నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Beast Movie to release on April 13th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News