Friday, April 26, 2024

చివరి షెడ్యూల్‌లో ‘అఖండ’

- Advertisement -
- Advertisement -

Begins the final schedule of ‘Akhanda’

 

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన వచ్చింది. ఈ టీజర్‌లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఈ టీజర్ ఇంకా సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఇక సోమవారం హైదరాబాద్‌లో ‘అఖండ’ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్ నుంచి అఖండ గెటప్‌లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News