Monday, April 29, 2024

ఉచిత బియ్యం కొందరికేనా..

- Advertisement -
- Advertisement -

Beneficiary pressure on dealer to give 10kg rice

 

స్టాక్ రాలేదని లబ్దిదారులకు చెబుతున్న డీలర్లు
పాత పద్దతిలోనే కిలో రూపాయకు చొప్పన 6కిలోలు పంపిణీ
10కేజీలు ఇవ్వాలని డీలర్లపై లబ్దిదారుల ఒత్తిడి
సెంటర్ సిటీలో కొన్ని చోట్ల ఉచిత బియ్యం అందజేత
కరోనా కాలంలో ఆదుకోవాలని కోరుతున్న పేద ప్రజలు

మన తెలంగాణ, హైదరాబాద్ : నగర ప్రజలకు గత ఏడాది కరోనా కాలంలో పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసి కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల నుంచి ప్రశంసలు పొందారు. ఈసారి కూడా అదే తరహాలో మే, జూన్ నెలల్లో ఒకరికి 10కిలోల చొప్పన పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించిన రాష్ట్ర పౌరసరఫరా అధికారులు మొండి చేయి చూపారని లబ్దిదారులు మండిపడుతున్నారు. అసలే కరోనా విజృంభణ చేస్తుండగా ఉపాధి కోల్పోయి లాక్‌డౌన్ నుంచి ఇంటి దగ్గర ఆర్దాకలితో జీవితం గడుపుతున్నారు.

ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం అందిస్తే మూడు పుటాల బోజనం చేస్తామని ఆశపడితే పాత పద్దతిలోనే కేజీ రూపాయి చొప్పను నగదు తీసుకుని డీలర్లు సరుకులు పంపిణీ చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డులు 60శాతం కేంద్ర, 40శాతం రాష్ట్ర పరిధిలో ఉండటంతో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. సరుకులు ఈనెల 3వ తేదీన పంపిణీ చేస్తూ ఒకరికి 6కేజీల చొప్పన ఇస్తుండటంతో కార్డుదారులు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన విధంగా 10కేజీలు ఇవ్వాలని డీలర్లతో వాగ్వాదం చేస్తున్నారు.

సరుకులు ఇచ్చే సమయం 4 గంటలు ఉండటంతో అందుకు ఉచిత బియ్యం స్టాక్ రాలేదని లబ్దిదారులకు సర్ది చెప్పడంతో గంట సమయం పోతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉచితం బియ్యం ప్రారంభకాలేదు. సెంటర్ సిటీలో కొన్ని మండలాల్లో ఇస్తున్నట్లు ప్రజలు పేర్కొనడంతో డీలర్లు పౌరసరఫరాల ఉన్నతాధికారులనే అడగాలని సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే ఈనెలకు సంబంధించి సరుకులు 70శాతం మంది తీసుకెళ్లినట్లు డీలర్లు వెల్లడిస్తున్నారు.

మరో వారం రోజుల్లో కోటా పూర్తి ఖాళీ అవుతుందని, ఎప్పుడు ఉచితం బియ్యం కోటా వస్తుందో తమకే అర్దంకావడంలేదని వాపోతున్నారు. హైదరాబాద్ నగరంలో 5,80,590 కార్డులుండగా 21,73,954 యూనిట్ల ద్వారా, 1,11.63,534 కిలోలు కేటాయిస్తున్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే నెలకు 1,36,21,768 కిలోల బియ్యం కావాల్సి వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు పేదల జీవన స్దితులు గమనించి మూడునెల పాటు రేషన్ ద్వారా ఉచితంగా బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు. కరోనా ఎప్పటివరకు తన ఉనికి చాటుకుంటుందో తెలియని పరిస్దితి, ఒక వేళ లాక్‌డౌన్ పొడిస్తే తమ పరిస్దితులు అగ్యమగోచరంగా ఉంటుందని వాపోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News