Saturday, April 27, 2024

స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహారాలు..

- Advertisement -
- Advertisement -

స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం అవసరం. బార్లీ, రెడ్ మీట్, బీన్స్ మొదలైనవాటిలో జింక్ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ అభివృద్ధిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. మగవారికి రోజుకు 15 ఎంజి వరకు జింక్ అవసరమవుతుంది. అరటిపండులో విటమిన్ ఎ. బి1, సి పుష్కలంగా ఉంటాయి. స్పెర్మ్ ఉత్పత్తికి ఇవి సహాయ పడతాయి. దానిమ్మ ఎక్కువగా తినడం వల్ల హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

అదనంగా స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే క్యారెట్ తీసుకున్నా స్పెర్మ్ పెరుగుతుంది. గుమ్మడి కాయ గింజలను రోజూ తినడం వల్ల శరీరంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సరఫరా పెరుగుతుంది. పురుషుల జననేంద్రియాల్లో రక్త ప్రసరణ పెంచుతుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తి పెంచుతుంది. టొమాటోలో ఉండే లైకోపీస్ అనే పదార్థం స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది. స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుంది. వెల్లుల్లి , పాలకూర, గుడ్లు స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను పెంచుతాయి.

Also Read: 2100 నాటికి హిమానీ నదాలు అదృశ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News