Wednesday, May 1, 2024

‘భారత్ పే’ చైర్మన్‌గా రజనీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 


న్యూఢిల్లీ: ఎస్‌బిఐ మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్‌ను తన బోర్డు చైర్మన్‌గా ‘భారత్ పే’ మంగళవారం నియమించింది. భారత్ పే చైర్మన్‌గా ఆయన సంస్థ స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహం, అలాగే బోర్డ్, ఎగ్జిక్యూటివ్‌ల క్రమబద్దీకరణ విషయాలు వగైరా చూస్తారు. “రజనీశ్ కుమార్ మార్గదర్శకత్వంలో మేము భారత అతి పెద్ద డిజిటల్ క్రెడిట్ ప్రొవైడర్‌గా మా సంస్థను తీర్చిదిద్దాలనుకుంటున్నాం” అని భారత్ పే సహవ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్‌నీర్ గ్రోవర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “రజనీశ్ కుమార్ సారథ్యంలో భారత్ పే కొత్త శిఖరాలు తాకుతుందన్న విశ్వాసంతో ఉన్నాం” అని కూడా ఆయన అభిలషించారు.

రజనీశ్ కుమార్ 2017 అక్టోబర్‌లో ఎస్‌బిఐ చైర్మన్‌గా నియుక్తులయ్యారు. 2020 అక్టోబర్‌లో పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆయన హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ ఆసియా, ఎల్ అండ్ టి లిమిటెడ్ స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలావుండగా ఆర్థిక సేవల రంగంలో ఫిన్ టెక్ స్టార్టప్ ‘భారత్ పే’ వచ్చి మూడేళ్లే అయినప్పటికీ, ఓ నమ్మకమైన సంస్థగా ఎదిగేందుకు చాలా పాటుపడిందని రజనీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News