Monday, April 29, 2024

ఆదిపురుష్‌ను నిషేధించండి: అమిత్ షాకు బఘేల్ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

రాయపూర్: చవకబారు సంభాషణలు, రామాయణ మహాకావ్యంలోని కొన్ని పాత్రల వక్రీకరణ వంటి ఆరోపణలతో విమర్శల పాలైన ఆదిపురుష్ చిచిత్రాన్ని నిషేధించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

అమిత్ షా గురువారం మధ్యాహ్నం రాయపూర్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన దుర్గ్ నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి వెళతారు. అమిత్ షా రాకను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి బఘేల్ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి మాతృభూమికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శ్రీరామ భక్తులు, రాష్ట్ర ప్రజలందరూ స్వాగతం పలుకుతున్నారని బఘేల్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రామాయణ మహాకావ్యాన్ని, దేవుళ్లను కించపరుస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించాలని ఆయన కోరారు.

ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడిని, ఆంజనేయస్వామిని కించపరిచే విధంగా చిత్రీకరించారని, రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధించే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఇదివరకే బఘేల్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంభాషణలు అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. హిందూ మత పరిరక్షకులమని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు దీనిపై మౌనం వహించడాన్ని పరోఖంగా బిజెపిని ప్రస్తావిస్తూ ఆయన తప్పుపట్టారు. గత శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ చిత్రం హిందువుల నుంచి తీవ్ర విమర్శలనెదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News