Saturday, May 4, 2024

బీబీ కా ఆలమ్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించిన నగర సిపి

- Advertisement -
- Advertisement -

Bibi Ka Alam City CP overseeing security arrangements

హైదరాబాద్: బీబీ కా ఆలమ్ ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పర్యవేక్షించారు. మోహరం సందర్భంగా నగరంలోని బీబీ కా ఆలమ్ ఊరేగింపును శుక్రవారం నిర్వహించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారులతో కలిసి సిపి అంజనీకుమార్ మధ్యాహ్నం సమయంలో ఊరేగింపును పర్యవేక్షించారు. ఊరేగింపులో ఏనుగు తొండంతో నగర సిపి అంజనీకుమార్‌ను ఆశీర్వదించింది. పోలీస్ అధికారులతో కలిసి సిపి అంజనీకుమార్ బీబీ కా ఆలమ్‌కు దట్టి సమర్పించారు. ఊరేగింపునకు నగర పోలీసులు విస్కృత ఏర్పాటు చేశారు. ప్రజల రక్షణ కోసం ర్యాపిడ్ యాక్షన్ బలగాలతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఊరేగింపులో నగర అదనపు పోలీస్ కమిషనర్లు శిఖాగోయల్, అనిల్‌కుమార్, డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News