Thursday, July 18, 2024

బైక్, మొబైల్ దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest

హైదరాబాద్: బైక్, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఆసిఫ్‌నగర్,ఎండి కాలనీకి చెందిన ఎండి మసూద్ ఖాన్, మీర్జా వాసి బైగ్, సయిద్ రిజ్వాన్, సయిద్ జహంగీర్ అలియాస్ అమీర్ కలిసి మొబైల్ ఫోన్లు, బైక్‌లు, ఆటోలు చోరీ చేస్తున్నారు.

వ్యసనాలకు అలవాటుపడిన నలుగురు నిందితులు చోరీలు చేయడంతో గతంలో పోలీసులు అరెస్టు రిమాండ్‌కు పంపించారు. బయటికి వచ్చిన తర్వాత ప్రవర్తనలో మార్పు రాకుండా మళ్లీ చోరీ చేయడం ప్రారంభించారు. ఆటోలో తిరుగుతూ బేగంబజార్‌లో చోరీలు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, సిబ్బంది అరెస్టు చేశారు.

Bike and Mobile Robbers Arrested At Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News