Monday, April 29, 2024

బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

BJP leaders joined TRS in presence of Harish Rao

సిద్దిపేట: జాతీయ పార్టీ బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ మంగళవారం దుబ్బాకలో పర్యటించారు. ఆయన సమక్షంలో దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన బిజెపి నేతలు, ముబారస్ పూర్ గ్రామ వార్డు మెంబర్లు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి దుబ్బాక ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాస్తి శ్రీనివాస్ కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సంధర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… రైతులు నష్టపోయేలా వ్యవహరిస్తున్నది బిజెపి పార్టీ కాదా..? అని ప్రశ్నించారు.

తెలంగాణను అభివృద్ధి చేసిన టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండని ప్రజలను కోరారు. ప్రజలకు మంచి చేయపోగా..వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకోవడం కేవలం బిజెపికే చెల్లుతుందన్నారు. బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టడం బిజెపి మంత్రులకే నచ్చలేదని ఆయన పేర్కొన్నారు. బిజెపి తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు విసిగి పార్టీకి రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. దేశంలోనే 280 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశంలో పండించే మక్కలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశమున్న.. విదేశాల నుంచి మక్కల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం సంతాకాలు చేసిందని మంత్రి హరీశ్ విమర్శించారు.

BJP leaders joined TRS in presence of Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News