Monday, May 6, 2024

ఓల్డ్ సిటీ ఎంఐఎం అడ్డా.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు

- Advertisement -
- Advertisement -

BJP will not survive in old city as long as MIM lasts

 

బిజెపికి అసద్ స్ట్రాంగ్ వార్నింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. ఎంఐఎం ఉన్నంత వరకు పాతబస్తీలో బిజెపికి మనుగడ ఉండదన్నారు. బల్దియా ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్‌సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తా అన్నారని, ముందు బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒవైసి విమర్శించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించడానికి ఓల్డ్ సిటీలో యూపి సిఎం, బిజెపి టీమ్ అంతా దిగిందని ఎద్దేవా చేశారు. కానీ ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు తిరుగులేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. బిజెపి పప్పులు పాతబస్తీలో ఉడకవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అడ్డా అని, భయపెడితే ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరంటూ అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News