Monday, May 6, 2024

రాజ్యసభ ఎన్నికలలో బిజెపికి బోనస్

- Advertisement -
- Advertisement -

BJP won 22 seats in the Rajya Sabha elections 2022

20 అనుకుంటే 22 దక్కాయి..

న్యూఢిల్లీ : దేశ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వెలువడ్డ రాజ్యసభ సీట్ల ఎన్నికల ఫలితాలు బిజెపికి బలం చేకూర్చాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డిఎ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరం అయిన ఓట్ల ఆధిక్యత నామమాత్రంగానే ఉంది. దీనితో ఇప్పుడు జరిగిన రాజ్యసభ 57 ఖాళీ స్థానాల భర్తీకి జరిగిన ఎన్నికలలో అసెంబ్లీల్లో సంఖ్యాబలం ప్రకారం బిజెపి కేవలం 20 స్థానాలను గెల్చుకోవచ్చునని ఆశించింది. అయితే 22 సీట్లు తెచ్చుకుంది. తాము మద్దతు ఇచ్చిన ఓ ఇండిపెండెంట్ హర్యానాలో గెలిచేలా చేసుకుంది. ప్రతిపక్ష శిబిరంలోని అసంతృప్తులు, ఏ పార్టీకి చెందని లెజిస్లేటర్లను తన వైపు మల్చుకునే దిశలో బిజెపి విజయం సాధించింది. క్రాస్ ఓటింగ్‌కు అవసరం అయిన కసరత్తులలో తమ ఆధిక్యతను బిజెపి ఎన్నికల నిర్వాహకులు రుజువు చేసుకున్నారు.

మహారాష్ట్ర, కర్నాటక, హర్యానాలలో ప్రతిపక్ష పార్టీలలో సఖ్యత లేమి ఇప్పటి ఎన్నికలతో మరింత స్పష్టం అయింది. ఏం చేసినా రాజస్థాన్ బిజెపికి కొరకరాని కొయ్య అయింది. ఆయా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్లకు మద్దతు ఇవ్వడం ప్రాధాన్యతా క్రమం ఓట్ల పద్ధతిలో ప్రత్యర్థి పార్టీల శ్రేణులలో విభజనలు కల్పించడంలో బిజెపి విజయం సాధించింది. ఇతర రాష్ట్రాలలో అదనంగా ఒక్కొటి చొప్పున బోనస్‌గా దక్కించుకున్న బిజెపికి రాజస్థాన్‌లో చుక్కెదురైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , సిఎం అశోక్ గెహ్లోట్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి కాకుండా చేశారు. చివరికి బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్‌కు పడేలా చేయడం ద్వారా మీడియా దిగ్గజం, బిజెపి మద్దతుతో బరిలో నిలిచిన సుభాష్ చంద్రను ఓడించగలిగారు. అయితే ఇప్పటి ఫలితాలు తమకు బాగా సంతోషాన్ని ఇచ్చాయని బిజెపి స్పందించింది. ప్రత్యేకించి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ అభ్యర్థులకు షాక్ తగిలించడంలో బిజెపి వ్యూహాలు ఫలించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News