Thursday, May 9, 2024

అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: ప్యాట్ కమ్మిన్స్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. ఏ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడం కష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కఠినమని.. అది చాలా నొప్పితో కూడుకున్నదని పేర్కొన్నాడు. పుజారా క్రీజ్‌లో ఓ దృఢమైన రాయిలో స్థిరపడి ఉంటాడని చెప్పిన కమ్మిన్స్.. అతను ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడని అన్నాడు. గత ఏడాది ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా అక్కడ తొలిసారిగా టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించి.. చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ఛతేశ్వర్ పుజారా.. కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, అయితే తన కెరీర్‌లో చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్లను ఎదురుకున్నానని చెప్పిన కమ్మిన్స్.. ఒక వ్యక్తికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని.. అతనే పుజారా అని అన్నాడు. “అతను అద్భుతమైన ఆటగాడు. ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు.. దీంతో అతన్ని ఔట్ చేయడం చాలా కష్టం. ప్రస్తుత టెస్ట్ క్రికెట్‌లో అతను చాలా గొప్ప ఆటగాడు” అని అతను పేర్కొన్నాడు.

Bowling problem indian player Pujara says cummins
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News