Monday, April 29, 2024

వ్యాక్సిన్ రక్షణ కాలంపై బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం

- Advertisement -
- Advertisement -
British researchers study vaccine protection period
కొన్ని నెలలకు తగ్గుముఖం పట్టినా కరోనా నుంచి భద్రతకు ఢోకా లేదు

లండన్ : కరోనా వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తరువాత క్షీణిస్తోందని బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐదు నుంచి ఆరు నెలల్లోనే ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ల నుంనచి పొందే రక్షణ తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. వచ్చే నెల నుంచి బూస్టర్ డోసు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోన్న సమయంలో తాజా అధ్యయనం అందుకు మరింత బలం చేకూరుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు, వ్యాక్సిన్‌ల పనితీరును తెలుసుకోడానికి బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన జెడ్‌ఒఇ అనే కొవిడ్ యాప్ డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్లు తీసుకున్న 12 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు.

ఫైజర్‌బయోఎన్‌టెక్ రూపొందించిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తొలి నెలలో 88 శాతం రక్షణ కల్పించగా, ఆరు నెలల తరువాత అది 74 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఇక ఆక్స్‌ఫర్డ్ /ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ అయిదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టు గుర్తించారు. ఇలా వయసు పై బడినవారితోపాటు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శీతాకాలం నాటికి ఈ వ్యాక్సిన్ల నుంచి కలిగే రక్షణ 50 శాతానికి తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ విధంగా వ్యాక్సిన్ల నుంచి రక్షణ కొన్ని నెలల తరువాత తగ్గుతున్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి అవి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ వ్యాక్సిన్ల కోసం వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకోవలసిన అవసరం ఉందని డాక్టర్ టిమ్ స్పెక్టర్ అభిప్రాయ పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News