Thursday, May 16, 2024

అమెరికాను భయపెడుతున్న హవానా సిండ్రోమ్

- Advertisement -
- Advertisement -

Havana Syndrome scares America

న్యూయార్క్ : అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేకమైన హవానా సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలకు అంతు పట్టడం లేదు. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో వెంటాడుతోంది. ఈ సిండ్రోమ్ కారణం గానే తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వియత్నాం పర్యటన కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. వియత్నాం లోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స కోసం తరలించాల్సి వచ్చింది. 2016 లో తొలిసారి దీన్ని క్యూబా లోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది.

కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్టు చప్పుడు వినిపిస్తుంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం కలుగుతుంది. అంతేకాదు విపరీతమైన అలసటతోపాటు ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి గురైన వారిలో మూడో వంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదడును స్కాన్ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్టు గుర్తించారు. సాధారణంగా ఏదైనా ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదు. తొలిసారి హవానాలో బయటపడడంతో ఆ పేరుతోనే ఈ సిండ్రోమ్‌ను పిలుస్తున్నారు. కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు.

క్యూబా, చైనా దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సిఐఎ సిబ్బంది, విదేశాంగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్, రష్యా లోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్ బాధితుల జాబితాలో ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఈ సిండ్రోమ్ వ్యాప్తికి క్యూబాయే కారణమని అమెరికా నిందించింది. కానీ తరువాత అమెరికా లోని అధికారులు కూడా దీని బారిన పడడంతో అమెరికా దీనికి కారణమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News