Monday, May 6, 2024

అక్కకు అసభ్య సందేశాలు

- Advertisement -
- Advertisement -
Police arrested brother for sending obscene messages to sister
తమ్ముడిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్: వరుసకు సోదరి అయిన యువతికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరానికి చెందిన యువతికి సోషల్ మీడియాలో తనకు సోదరుడు కావాల్సిన వ్యక్తి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News