Friday, May 3, 2024

ప్రియుడినే పెళ్లి చేసుకుంటా… పెట్రోల్ పోసి తగలబెట్టారు…

- Advertisement -
- Advertisement -

Brother arrested in sister love affair

అమరావతి: ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పడంతో ఆమెపై తల్లిదండ్రులు, సోదరుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్‌ఆర్ కడప జిల్లా రాయచోటిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్త పల్లెలో పఠాన్ మహమ్మద్, మున్వర్ జాన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తన కుమార్తె తహసీన్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తాను ఇమ్రాన్ అనే యువకుడిని ప్రేమించానని అతడి పెళ్లి చేసుకుంటానని తహసీన్ కుటుంబ సభ్యులకు తెలిపింది. తాము సూచించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఆమెను హెచ్చరించారు. వాళ్లు ఎంత చెప్పిన వినకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె సోదరుడు తహసీన్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కన్నకూతురు మంటల్లో కాలిపోతున్న చూస్తుండిపోయారు కానీ పట్టించుకోలేదు. గ్రామస్థులు గమనించి మంటలను ఆర్పేసి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News