Saturday, April 27, 2024

మార్కెట్లో పట్టు బిగించిన బుల్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం కొత్త శిఖరాలను తాకింది. నేడు వరుసగా ఎనిమిదవ రోజు కూడా లాభాల్లో పయనించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్వల్పంగా పెంచనుందన్న భావంతో మార్కెట్ లాభాల్లో నడిచింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184.54 పాయింట్లు లేక 0.29 శాతం పెరిగి 63284.19 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 54.20 పాయింట్లు లేక 0.29 శాతం పెరిగి 18812.50 వద్ద ముగిసింది. మొత్తానికి డిసెంబర్ 1న ఓ స్ట్రాంగ్ నోట్‌తోనే మార్కెట్ కొనసాగింది. ఇంట్రాడేలో రెండవ అర్ధభాగంలో లాభాల స్వీకరణ కొనసాగింది. నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడగా, ఐసిఐసిఐ బ్యాంకు, ఐషెర్ మోటార్స్, యూపిఎల్, సిప్లా, బజాజ్ ఆటో నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News