Wednesday, May 1, 2024

ఓటర్ల మార్పులులో జాగ్రత్త వహించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఎల్‌ఓలు సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్‌ఎస్‌ఆర్ 2023 పై బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్‌ఓ) యాప్‌లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఎవైనా అవసరమైతే సమకూర్చాలని తెలిపారు. పొలిటికల్ పార్టీ కార్యాలయాలకు 2 కిమి దూరంలో, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు.

చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుండి వివరాలను తొలగించాలన్నారు. అనాథలు, ఒంటరి, కూలీ కొసం ఊరురూ తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్దుల కొరకు ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, కరీంనగర్ హుజురాబాద్ ఆర్డిఓలు ఆనంద్ కమార్, హరిసింగ్‌లు, ఎస్సారార్ డిగ్రికళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు మల్లారెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఎఓ జగత్ సింగ్, అసెంబ్లి లెవల్ మాస్టర్ ట్రైనర్లు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News