Home తాజా వార్తలు ప్రియురాలి కూతురుపైనా అత్యాచారం.?

ప్రియురాలి కూతురుపైనా అత్యాచారం.?

Case against Sanjay Kumar Yadav Under Pocso Act

సంజయ్‌పై ‘పోక్సో’ చట్టం కింద కేసు

హైదరాబాద్ : గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్ తన ప్రియురాలు కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు సంజయ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయనన్నారు. గొర్రెకుంట ఘటనలో 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.

ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్‌ఉన్నారు. మహ్మద్‌మక్సూద్‌ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడంతో తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్..

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్ పోలీసుల విచారణలో విస్మయపరిచే విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను ఆరు రోజులపాటు విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆది, సోమవారాల్లో ఘటనాస్థలం, గోదాముల ప్రాంతంతోపాటు గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ ఆదర్శనగర్‌లో అతను అద్దెకు ఉంటున్న ప్రాంతం, నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్‌షాపు ప్రాంతాల్లో మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం.