Tuesday, May 21, 2024

స్పెషల్ సాంగ్‌లో..

- Advertisement -
- Advertisement -

Catherine special song in Ravi Teja's New Movie

మాస్ మహారాజ రవితేజ ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నిధి అగర్వాల్, సభా నటేష్‌లను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో ఒక హుషారైన స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఈ పాటలో రవితేజకు జోడీగా చిందులేసేందుకు కేథరిన్ థెరిసాను తీసుకోవాలని ఫిల్మ్‌మేకర్స్ అనుకుంటున్నారట. ఇటీవల కేథరిన్‌కు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేసింది. మళ్లీ రవితేజతో ప్రత్యేక సాంగ్‌తోనైనా ఆమె మెరుస్తుందేమో చూడాలి. ఇక రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘క్రాక్ ’ వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత ‘క్రాక్’ థియేటర్లలోనే విడుదల కానుంది. ఇక ‘రాక్షసుడు’ రీమేక్‌తో హిట్టు కొట్టిన రమేష్ వర్మ రవితేజకు హిట్టు ఇస్తాడేమో చూడాలి.

Catherine special song in Ravi Teja’s New Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News