Saturday, April 27, 2024

స్వల్ప లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఇంటికే పరిమితం

- Advertisement -
- Advertisement -

స్వల్ప లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఇంటికే పరిమితం
బీపీ, షుగర్ ఉంటే వైద్యుల సలహా పాటించండి
చివరి మూడు రోజులు జ్వరం రాకపోతే కొవిడ్ పరీక్ష అవసరం లేదు
కరోనా బాధితుల కొసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Center Issues new guidelines for corona patients

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలని తెలిపింది. కరోనా బాధితులు 3 పొరల మాస్క్ ధరించాలని పేర్కొంది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని ప్రజలకు విన్నవించింది. ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని పేర్కొంది. చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదు స్పష్టం చేసింది.

Center Issues new guidelines for corona patients

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News