Saturday, May 4, 2024

వాట్సాప్ కొత్త పాలసీకి చెక్

- Advertisement -
- Advertisement -

Central Govt urges Delhi HC to restrain WhatsApp

న్యూఢిల్లీ: వాట్సాప్ తలపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని నిలిపివేయాలని కేంద్రప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి ఓ పిల్ విచారణలో ఉన్న విషయాన్నిశుక్రవారం ఈ సందర్భంగా తెలిపింది. ఈ అంశంపై స్టే విధించాలని కోరింది. . వాట్సాప్ పాలసీలోని కొన్ని అంశాలలో స్పష్టత లేదని కేంద్రం హైకోర్టుకు విన్నవించుకుంది. అత్యంత ప్రధానమైన డాటా సేకరణ జరిగే పద్ధతులను పాలసీలో స్పష్టం చేయడం లేదని తెలిపారు. సమాచార సమీక్షకు వీలు కల్పించాలి. లేదా దీనిని సవరించాలి. లేదా అంతకు ముందటి దశ నుంచి సమ్మతిని ఉపసంహరించుకునే వీలు కల్పించాలి. అంతేకాకుండా మూడో పక్షం ద్వారా సమాచారం వెల్లడికాకుండా గ్యారంటీ కల్పించాలని ఈ అభ్యర్థనలో తెలిపారు. వివిధ సోషల్ మీడియా సైట్లు, మిస్సేజ్‌ల యాప్‌లు డాటా వినిమయానికి దిగుతున్నాయనే అంశాన్ని కేంద్రం హైకోర్టు దృష్టికి తెచ్చింది. వివాదాస్పద ప్రైవసీ పాలసీ 2011 ఐటి నిబంధనలను అతిక్రమించేలా ఉందని ప్రభుత్వం పేర్కొంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌షర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ న్యాయస్థానానికి సబంధిత విషయంపై సమాధానం ఇచ్చుకుంది. కేంద్రం ఇప్పటికే పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు 2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టిందని ఇందులో తెలిపారు. ఇది చట్టరూపం దాలిస్తే వాట్సాప్ వంటి సంస్థలు సొంతంగా ప్రైవసీ పాలసీలు వెలువరించడంపై కట్టడి ఉంటుందని పేర్కొన్నారు. భద్రత, డాటా సంరక్షణకు సంబంధించిన సముచిత ప్రామాణికతలకు అనుగుణంగా లేని పాలసీలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉంది. అంతకు ముందటి సమాచార సాంకేతిక చట్టాలకు అనుగుణంగా చూసినా కూడా వాట్సాప్ వంటి సంస్థలు వెలువరించే ఎటువంటి ప్రైవసీ పాలసీలు అయినా చట్టం పరిధికి కట్టుబడి ఉండాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. ఇక వాట్సాప్ ప్రైవసీ పాలసీ సంబంధిత అంశంపై నొయిడా నివాసం డాక్టర్ సీమా సింగ్, ఢిల్లీకి చెందిన మేఘన్, విక్రమ్‌సింగ్‌తో కలిపి పిటిషన్ వేశారు. ఐటి మంత్రిత్వశాఖ చట్టానికి సంబంధించి డాటా సమగ్రత పరిరక్షణ విషయంలో పలు లొసుగులు ఉన్నాయని తెలిపారు.

ఇవి కొట్టొచ్చేరీతిలో ఉంటూ వస్తున్నాయని, వీటిని సరైన విధంగా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, ఇది తక్షణ కర్తవ్యం అని పిటిషనర్లు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను కోట్లాది మంది భావ వ్యక్తీకరణక వాడుతున్నారు. ప్రత్యేకించి లక్షలాది మంది భారతీయులు ఎక్కువగా వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఈ దశలో కేంద్రానికి వాట్సాప్ నిర్వాహకులకు తలెత్తిన అంశాలు వాట్సాప్ వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పిటిషన్లపై విచారణ, ఇప్పుడు కేంద్రం దాఖలు చేసుకున్నఅప్పీల్‌కు సంంధించి విచారణను హైకోర్టు ఎప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం ఇప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ఎక్కడా పౌరుల ప్రైవసీ పరిరక్షణ అంశం ప్రస్తావించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆ తరువాత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News