Friday, May 3, 2024

వంట నూనెల ధరలు తగ్గుతాయా?

- Advertisement -
- Advertisement -

వంట నూనెల ధరలు తగ్గుతాయా?
సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం
న్యూఢిల్లీ : ఖరీదైన ఎడిబుల్ ఆయిల్(వంట నూనె) ధరలు దిగొస్తాయా? ఎందుకంటే కేంద్ర ప్ర భుత్వం ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. రిఫైన్డ్ సోయా ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్ విషయంలో ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 13.75 శాతం, రిఫైన్డ్ ఆయిల్‌పై 12.5 శాతం దిగుమతి సుంకం, 10 శాతం సబ్ టాక్స్ ఉంటాయి. అన్ని ప్రధాన క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై సుంకం 5.5 శాతం వర్తిస్తుంది. ఎడిబుల్ ఆయిల్ ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

మార్కెట్‌పై కొంత తా త్కాలిక ప్రభావం చూపుతుందని, అయితే దిగుమతులపై ఉండకపోవచ్చని ఎస్‌ఇఎ(సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా అన్నారు. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో దేశంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతి రికార్డు స్థాయిలో ఉంది. ఎస్‌ఇఎ ప్రకారం, పామాయిల్ దిగుమతులు 4.9 మిలియన్ టన్నులకు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News