Home తాజా వార్తలు వాహనదారులకు ధృవపత్రాలు తప్పనిసరి

వాహనదారులకు ధృవపత్రాలు తప్పనిసరి

మన తెలంగాణ/చెన్నరావుపేట: వాహనదారులకు ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని శీలం రవి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీచేసి ధృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట తీసుకరావాలన్నారు. లేనిపక్షంలో వాహనదారులకు జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలో సిబ్బంది క్రాంతి, తిరుపతి, జ్ఞానేశ్వర్, బాలాజీతోపాటు పలువురు పాల్గొన్నారు.