Saturday, April 27, 2024

త్రిపుర పురపాలికల ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

BJP bags landslide victory in Tripura

అగర్తలా: త్రిపుర లోని నగరపాలిక, పురపాలిక ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ బిజెపి ఘన విజయం సాధించింది. అగర్తల నగరపాలక సంస్థతోపాటు 13 పురపాలక సంఘాలకు నవంబర్ 25న జరిగిన ఎన్నికలకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. టిఎంసి, సిపిఎం నామమాత్రపు ఫలితాలనే సాధించాయి. అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 51 వార్డులు బిజెపి కైవశం అయ్యాయి. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 13 మున్సిపాలిటీలకు, 6 నగర పంచాయతీలకు కలపి మొత్తం 334 సీట్లకు బిజెపి తన అభ్యర్థులను పోటీలో ఉంచగా, 112 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖొవాయి మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 15 వార్డులన బిజెపి దక్కించుకుంది. బెలోనియా మున్సినల్ కౌన్సిలులో మొత్తం 17 సీట్లను, కుమార్‌ఘాట్ మున్సిపల్ కౌన్సిల్‌లో 15 సీట్లను, సబ్‌రూమ్ నగర పంచాయతీలో 9 సీట్లను బిజెపి గెలుచుకుంది. ధర్మనగర్ మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 25 వార్డులను బిజెపి క్లీన్‌స్వీప్ చేసింది.

అలాగే తెలియముర మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 15 సీట్లు, అమర్‌పూర్ నగర పంచాయతీలో మొత్తం 13 సీట్లు బిజెపీయే సాధించుకుంది. ప్రతిపక్షాలకు చెందిన సోనాముర నగర పంచాయతీ, మెలాఘర్ నగర పంచాయతీలో చెరో 13 సీట్లను బిజెపి గెల్చుకుంది. జిరానియా నగర పంచాయతీలో 11 సీట్లు, బిజెపికి దక్కాయి. అంబస్సా మున్సిపల్ కౌన్సిల్‌లో 12 సీట్లు బిజెపికి దక్కగా, టిఎంసి, సిపిఎం చెరో ఒక్క స్థానం గెలుచుకున్నాయి. మరోసీటు ఇండిపెండెంట్‌కు వెళ్లింది. కైలాసనగర్ మున్సిపల్ కౌన్సిల్‌లో 16 సీట్లు బిజెపికి రాగా, సిపిఎంకు ఒకటి లభించింది. పనిసాగర్ నగర పంచాయతీలో బిజెపి 12 సీట్లు గెల్చుకోగా, సిపిఎంకు ఒక్కటే లభించింది. తృణమూల్‌తో బిజెపి గట్టిపోటీ ఎదుర్కొన్నా ఈశాన్య ప్రాంతం లోకానీ, మరెక్కడా కానీ తాను జాతీయ పార్టీగా స్థిరపడగలిగింది. ఇక సిపిఎం విషయానికొస్తే కొన్నేళ్ల క్రితమే బిజెపి ఆ పార్టీని ఓడించడం జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలపై టిఎంసి స్పందిస్తూ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌తోపాటు బెదిరింపులు ఎక్కువగా జరిగాయని ఆరోపించింది.

మొత్తం ఈ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మున్సిపాలిటీల్లో తాజాగా మళ్లీ ఎన్నికలు జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బిజెపి మద్దతుదారులు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నా, రిగ్గింగ్ చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించిందని ఈ రెండు పార్టీలు ఆరోపించాయి. బిజెపి ఈ ఎన్నికల ఫలితాలకు స్పందిస్తూ ఈశాన్య ప్రాంతంలో బాటలు వేయగలమని టిఎంసి చేసిన శుష్క వాగ్దానాలను ఈ ఎన్నికల ఫలితాలు బట్టబయలు చేశాయని బిజెపి ఉపాధ్యక్షుడు దిలీప్‌ఘోష్ వ్యాఖ్యానించారు. బిజెపిపై ప్రజలు నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి అద్దెకు తెచ్చుకున్న వారితో టిఎంసి ప్రచారాలు సాగించిందని, రాష్ట్రం లోని ప్రజలతో బిజెపి గాఢమైన అనుబంధాన్ని పంచుకుందని ఘోష్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News