Saturday, May 4, 2024

IPL 2023: చాహల్ నయా రికార్డు..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా చాహల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న (183) అత్యధిక వికెట్ల రికార్డును చాహల్ తిరగరాశాడు.

బ్రావో ఐపిఎల్‌లో 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు పడగొట్టాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ప్రస్తుతం రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాహల్ 143 మ్యాచుల్లోనే 186 వికెట్లను పడగొట్టి తన పేరిట కొత్త రికార్డును సృష్టించాడు. చాహల్ గతంలో ముంబై, బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

Also Read: సీఎం వైఎస్‌ జగన్‌తో అంబటి రాయుడు భేటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News